ATP: గుత్తిలోని శ్రీ వాసవి కెపిఎస్ కళ్యాణ మండపంలో బుధవారం గౌతమ పురి ఖండ ఆధ్వర్యంలో సద్భావన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హిందువులంతా కులమతాలకు అతీతంగా ఒక్కటిగా కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత కొరవడి దేశంలో అశాంతి నెలకొంటుందన్నారు. సమాజంలో సామాజిక సామరస్యత ముఖ్యమని పేర్కొన్నారు.