KNR: ఇల్లందకుంట మండలంలోని 42 పోలింగ్ బూత్ల ఓటర్ల జాబితాను MPDO కార్యాలయంలో ఎంపీడీవో రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 42 బూత్ల వారీగా ఓటర్ లిస్ట్ తయారు చేసి గ్రామ పంచాయతీలకు పంపించామని MPDO తెలిపారు. ఓటర్ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు.