కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, జగ్గంపేట వైసీపీ ఇంఛార్జ్ తోట నరసింహం ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని జగ్గంపేటలో నిర్వహించారు. అనంతరం జగ్గంపేట నుంచి పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయల్దేరి ఆర్డీవోకి వినతిపత్రం సమర్పించారు.