AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల ఐదు రోజులపాటు కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని, 40-60కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.