ప్రతి ఏడాది భాద్రపద మాసంలో బహుళ తదియ రోజున ఆడవాళ్లందరూ ఉండ్రాళ్ల తద్ది నోము నోచుకుంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేస్తారు. సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి బియ్యం పిండితో ఉండ్రాళ్లు చేసి గౌరీదేవికి నివేదించి పూజిస్తారు. ఈ నోము నోచిన పెళ్లికాని కన్యలు విశేష ఫలితాలను పొందుతారని వేదపండితులు చెప్తున్నారు.