GNTR: అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య అన్నారు. మంగళవారం వైసీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘అన్నదాత పోరుబాట’ కార్యక్రమానికి అనుమతి లేదంటూ గుంటూరులోని నివాసం వద్ద ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అన్నదాతలకు అండగా నిలవడంలో వైసీపీ ముందు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.