సంగారెడ్డి: కల్హేర్ మండలంలోని క్రిష్ణపూర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, న్యూ బాంబే కట్ పీస్ నారాయణఖేడ్ వ్యవస్థాపకులు స్వర్గీయ చోల్కర్ వెంకట్రావు స్మారకార్థం గ్రామ పంచాయతీ సానిటరీ సిబ్బందికి దసరా కానుకగా బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ మల్లేష్, మర్దొడ్డి విఠల్, పెద్దాడే బాలరాజు, సెక్రటరీ రమేష్, వెంకటేశం, గంగారం పాల్గొన్నారు.