MDK: కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలో సోమవారం జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరిశీలించారు. గ్యాస్ పేలుడు ఘటనలో గాయపడ్డ బాధితులను ఆమె పరామర్శించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు, బాధితులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకోవాలని కోరారు.