NLG: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండా శ్రీశైలం డిమాండ్ చేశారు. చండూరు మండలం నెర్మట గ్రామ శాఖ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.2500, వికలాంగులకు రూ.6000, కూలీలకు రూ.12000, కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి నెరవేర్చలేదని విమర్శించారు.