NZB: ఆర్మూర్ మండలం ఫతేపూర్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సులభంగా అర్థమయ్యే రీతిలో పథకాలను వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి నిర్మూలనలో భాగస్వాములవ్వాలని కోరారు.