RR: హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి కురుమబస్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీలో త్రి-ఫేస్ కరెంట్ లేనందువల్ల తరచూ ఎలక్ట్రానిక్ పరికరాలు రిపేర్ అవడం జరుగుతుందని బస్తీవాసులు వివరించారు. కార్పొరేటర్ స్పందించి బస్తీలో త్రీ-ఫేస్ కరెంట్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.