NZB: సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారిందని నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్ అన్నారు. మంగళవారం నందిపేట్ మండల కేంద్రంలో ముగ్గురు లబ్ధిదారులకు రూ.1,49,000 CMRF చెక్కులను పంపిణీ చేశారు. సీఎం సహాయనిధి ద్వారా పేదలకు ఎంతో లబ్ధి కలుగుతుందన్నారు. ప్రభుత్వానికి లబ్ధిదారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.