ప్రకాశం: భూసార పరీక్షల అనుగుణంగానే రైతులు ఎరువులు వాడుకోవాలని కనిగిరి వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ యాదవ రమా శ్రీనివాస్ అన్నారు. ఇవాళ కనిగిరి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో రైతులతో భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. పొగాకు రైతులందరూ పంట నమోదు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారులు సూచించిన పంటలు వేసుకోవాలని తెలిపారు.