ATP: సీఎం చంద్రబాబు అనంతపురం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 1.30కు అనంతపురం చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం, సూపర్-సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పాల్గొంటారు. సభ అనంతరం తిరిగి ఉండవల్లికి వెళ్తారు.