TG: గ్రూప్-1కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ‘రేవంత్ రెడ్డి 563 గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నాడు. కచ్చితంగా రేవంత్ మీద సీబీఐ ఎంక్వయిరీ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. దీంట్లో అక్రమాలు జరిగాయని కోర్టే చెప్పింది.. అందుకే బండి సంజయ్ సీబీఐ ఎంక్వయిరీ వెయ్యమని కోరాలి’ అంటూ డిమాండ్ చేశారు.