NLR: తెలుగు భాషా దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలలో విజేతగా నిలిచిన గండికోట సుధీర్ కుమార్ ను బుచ్చి పట్టణం రామచంద్రాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. మచిలీపట్నం సాహితీ మిత్రులు ఆధ్వర్యంలో డాక్టర్ వి.వి.శోభ స్మారక జాతీయస్థాయి కవితల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.