W.G: మాజీ మంత్రి, రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధి నాయకురాలు పరిటాల సునీతని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లీ రాధాకృష్ణ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రేపు జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే రాప్తాడు నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు.