PPM: కురుపాం మండలం గుమ్మ పంచాయతీలో ఇటీవల అధికంగా జ్వరాలబారిన పడటంతో మంగళవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అక్కడకు చేరుకుని వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితులందరికీ అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేయాలని సిబ్బందికి సూచించారు.