సత్యసాయి: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు కరణ చేస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. మంగళవారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. పులివెందులలో దొంగ ఓట్లు వేయించుకుని టీడీపీ గెలిచిందని ఆరోపించారు. జగన్ గురించి పులివెందుల గురించి మాట్లాడే అర్హత మంత్రి సవితకు లేదన్నారు. మంత్రి సవిత జగన్ పై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.