కోనసీమ: యూరియా కొరతపై అన్నదాత పోరు కార్యక్రమాన్ని అమలాపురంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా కూడా దొరకడం లేదని ఆరోపించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలని కోరుతూ అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీ ఇశ్రాయిల్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్దయెత్తున ర్యాలీ చేపట్టారు.