ASF: కెరమెరి మండలంలోని అనార్ పల్లి, లక్మాపూర్ వాగులపై వంతెనల పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని NHRC జిల్లా ఛైర్మెన్ రాథోడ్ రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం పంచాయతీరాజ్ సూపరిడెంట్ రవీందర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. వంతెన నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తే అతి 12 గ్రామాల ప్రజలతో కలిసి పంచాయతీరాజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.