ELR: నూజివీడు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ట్రిపుల్ ఐటి ప్రొఫెసర్ గోపాలరాజును బీజేపీ శ్రేణులు మంగళవారం పరామర్శించాయి. విద్యార్థి కత్తితో దాడి చేయడం వలన గాయాల పాలైన ప్రొఫెసర్ గోపాలరాజు ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నేతలు మాటూరు రవికాంత్, జగదీష్, తదితరులు పరామర్శించారు.