KMM: ప్రజల్లో చైతన్య దీప్తిని రగిలించి జీవితాంతం వారి గొంతుకగా బతికిన ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని.. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఘన నివాళులర్పించారు. స్వరాష్ట్ర ఉద్యమానికి తన రచనలతో స్ఫూర్తిని నింపిన మహనీయుడని కొనియాడారు.