అన్నమయ్య: రాయచోటి పట్టణ పరిధిలోని 25వ వార్డ్ సచివాలయంలో మంగళవారం వాటర్ సమస్యలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవి మాట్లాడుతూ.. నీటి సరఫరా సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపడతామని, ప్రజల సహకారంతో మెరుగైన సేవలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.