అన్నమయ్య: రామసముద్రం మండలంలోని మినికి సచివాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. అనంతరం సచివాలయం అధికారులు యూరియా పంపిణీ ప్రారంభించారు. సరిపడినంత యూరియా ఉందుబాటులో లేకపోవడంతో రైతులకు టోకెన్లు ఇచ్చారు. దీంతో క్యూలైన్లలో కిక్కిరిసి నిల్చున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా SI రమేశ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.