నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ దేశంలో సోషల్ మీడియాపై నిషేధంతో ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల తర్వాత వరుసగా మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. దీంతో ప్రధాని కేపీ ఓలీ రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.