ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు రైతు పోరు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు , కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేడు యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.