SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి మెరుగైన విద్యుత్ సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ. 2.18 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీంతో లో వోల్టేజ్ సమస్యలు తొలగి, పరిసర ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్క, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషితో సబ్ స్టేషన్ మంజూరు సాధ్యమైంది.