ప్రకాశం: కనిగిరిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని సీఐ ఖాజావలి, ఎస్సై టి. శ్రీరామ్ మంగళవారం రాత్రి తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో పోలీసు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించరాదని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతి లేదని, కేవలం 15 మంది మాత్రమే శాంతియుతంగా వెళ్లి వినతిపత్రం అందించాలి అన్నారు.