BHPL: పట్టణ కేంద్రంలోని ఓ కళాశాలలో సోమవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ, లైంగిక వేధింపుల నివారణ చట్టాలపై సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల హాజరై, మాట్లాడుతూ.. లైంగిక వేధింపులపై మౌనం వహించాల్సిన అవసరం లేదని, మహిళలకు పురుషులతో సమానంగా చట్ట రక్షణ ఉందని తెలిపారు.