ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం జేసీ అగ్రహారం సర్పంచ్ రాజేశ్వరి, తనను తన మరిది మేకల రమణయ్య, అతని కుటుంబ సభ్యులు కలిసి దాడి చేశారని ఆరోపించారు. సర్పంచ్‌గా తాను గెలిచినప్పటికీ, పెత్తనం మొత్తం మరిది రమణయ్యే చేస్తున్నాడని ఆమె వాపోయారు. ఈ ఘటనపై బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లో రాజేశ్వరి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.