SKLM: ఆమదాలవలస పట్టణం డాబాల వారి వీధిలో అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగవలసకు చెందిన జి.ఉపేంద్ర (28) కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు.