SKLM: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిల్వలను జిల్లాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.