ATP: పట్టణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో సాంకేతికత పాత్ర అనే అంశంపై మంగళవారం ముంబైలో జరిగే జాతీయ మేయర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు అనంత నగర మేయర్ మహ్మద్ వసీం సలీం హాజరుకానున్నారు. జాతీయ సదస్సుకు హాజరై నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై చర్చిస్తానని సోమవారం ఆయన పేర్కొన్నారు. స్మార్సెటీ జాబితాలో అనంత నగరాన్ని చేర్చడానికి కృషి చేస్తానని తెలిపారు.