AP: MLA కొలికపూడిపై TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ‘కొలికపూడి తనకు తాను గొప్పగా ఊహించుకుంటున్నారు. ఆయనకు చివరి వార్నింగ్ అయిపోయింది, మళ్లీ పిలిచి మాట్లాడబోం. వ్యక్తిగత ఇమేజ్‌తో ఎవరూ గెలవరు, ఇది కొలికపూడికి అర్థం కావట్లేదు. ఇదే విషయాన్ని అసెంబ్లీ లాబీలో కొలికపూడికి చెప్పాను. తప్పైందని, మీరు చెప్పినట్లే నడుచుకుంటానని చెప్పారు’ అని పేర్కొన్నారు.