కడప: పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సోమవారం రైతులతో సమావేశమయ్యారు. రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. నిజమైన రైతుకు పూర్తి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సరైన గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు.