రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయంపై ఇండియా కూటమి దృష్టి సారించింది. ఈ క్రమంలో పార్లమెంట్ సెంట్రల్ హాలులో తమ ఎంపీలకు ఓటు వినియోగంపై మాక్ పోలింగ్ నిర్వహించింది. గత ఎన్నికల్లో 15 మంది ఎంపీలు సరిగా ఓటు వేయకపోవడంతో ఈ మాక్ పోల్ నిర్వహించింది. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, అనంతరం కౌంటింగ్ జరగనుంది. మరోవైపు ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్, బీజేడీ నిర్ణయించాయి.