NLG: వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బొలుగూరి లింగయ్య తహసీల్దార్ కృష్ణ నాయక్‌కు సోమవారం వినతిని అందించారు. పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి పథకాన్ని వర్తింపజేయాలని, సంక్షేమ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని వినతిలో పేర్కొన్నమని లింగయ్య తెలిపారు.