హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా ఏసీ పేలిపోయింది. ఈ ఘటనలో సచిన్ కపూర్, అతని భార్య రింకూ కపూర్, వారి కుమార్తె సుజన్ మృతిచెందారు. కిటికీలో నుంచి బయటకు దూకి సచిన్ కుమారుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే, సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.