TPT: పుత్తూరు మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన నగరి నియోజకవర్గం బీసీ సెల్ సెక్రటరీ డి. శ్రీనివాసులు తమ్ముడు డి. చిన్నికృష్ణ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ వారి ఇంటికి చేరుకున్నారు. చిన్ని కృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఎప్పుడు ఏ సమస్య వచ్చిన నేను ఉన్నానని సూచించారు.