అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2కు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌ను.. ఈ నెల 13 నుంచి మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
ముందుగా బ్యాంకాక్ అడవుల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించబోతున్నారట. దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత.. వచ్చే నెలలో అవతార్2 సినిమాతో పాటు టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. పుష్ప2 పై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని..
బడ్జెట్ విషయంలో నిర్మాతలు నో కాంప్రమైజ్ అంటున్నారట. గతంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు వార్తలు రాగా.. ఇప్పుడు సుకుమార్ ఎంత అడిగితే అంత ఇచ్చేలా.. అన్ లిమిటెడ్ బడ్జెట్ పెట్టేందుకు డిసైడ్ అయిపోయారట మైత్రీ మూవీ మేకర్స్. దాంతో సుకుమార్‌కు అంతకుమించి అనేలా భారీగా తెరకెక్కించబోతున్నాడట. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా చర్చ జరుగుతోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ గతేడాది డిసెంబర్లో విడుదలైంది.
దాంతో ఈసారి కూడా అదే సమయంలో.. క్రిస్మస్ టార్గెట్‌గా పుష్ప2 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పుష్ప హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ.. వచ్చే ఏడాది డిసెంబర్లో ‘పుష్ప 2’ రిలీజ్ అవడం పక్కా అంటున్నారు. ఇక రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.