WGL: నల్లబెల్లి మండలంలో రైతులు యూరియా కోసం ఈరోజు ఉదయం నుంచి ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద బారులు తీరారు. రోడ్డుపై వాహనాలు నిలిచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ అధికారి రజిత స్పందిస్తూ.. మండల కేంద్రంలోని రెండు దుకాణాలకు వచ్చిన 400 యూరియా బస్తాలను నేడు పంపిణీ చేస్తామని, నల్లబెల్లి రైతు వేదిక వద్ద కూపన్లు అందజేస్తామని తెలిపారు.