SRD: గుండెపోటుతో రైతు మృతి చెందిన ఘటన సిర్గాపూర్ మండలం పోచపూర్ గ్రామంలో జరిగింది. సోమవారం స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి అంబయ్య(43) ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో ఖేడ్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించి గుండెపోటుతో మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.