W.G: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం భీమవరం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు యూరియా లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే ఈనెల 9న రైతుపోరు కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు.