NLG: సీపీఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం జీవితం నేటి యువతరానికి ఆదర్శనీయమని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఆదివారం జరిగిన నియోజకవర్గస్థాయి పార్టీ సమన్వయ సమావేశానికి హాజరై మాట్లాడుతూ… సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి వేడుకలు ఈనెల 12న నల్గొండ పట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.