KMR: ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తు కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బిక్కనూర్ మండలం జంగంపల్లిలోని మహాత్మా జ్యోతి బాఫూలే గురుకుల పాఠశాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.