ADB: వంజరి సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఈరోజు ఎమ్మెల్యే నివాసంలో బోథ్ మండల వంజరి సంఘం సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సంఘ భవన నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరలో నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.