క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న BCCI బ్యాంక్ బ్యాలెన్స్ రికార్డు స్థాయికి చేరింది. కేవలం 12 నెలల వ్యవధిలోనే BCCI బ్యాంక్ బ్యాలెన్స్ రూ.20,686 కోట్లకు చేరింది. 2019లో రూ. 6,059 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.20,686 కోట్లకు చేరుకుని ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ సంస్థగా BCCI నిలిచింది. కాగా 2023-24లో ఈ సంస్థ దాదాపు రూ.3,150 కోట్ల పన్ను చెల్లించడం గమనించాల్సిన విషయం.