KNR: వర్షాల నేపథ్యంలో వాయిదా పడిన జమ్మికుంట మండల ఎసీఎఫ్ క్రీడలు సెప్టెంబర్ 8-10వ తేదీ వరకు జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో జరుగుతాయని ఎంఈవో మంతెన హేమలత తెలిపారు. 8న బాలికల, 9న బాలుర ఖోఖో, వాలీబాల్, కబడ్డీ పోటీలు, 10న అథ్లెటిక్స్ నిర్వహిస్తారు. పాల్గొనే వారు జనన సర్టిఫికేట్, ఆధార్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు.