TG: రవాణా సమస్యలను సాకుగా చూపి MRP కంటే ఎక్కువ ధరకు యూరియా అమ్ముతున్న వ్యాపారులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. వారి లైసెన్సులు రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. యూరియా పంపిణీలో అక్రమాలు జరగకుండా చూడాలని, PACS, రైతు వేదికల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి సులభంగా యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.